D Educt: Oct 15: వైద్య విద్యలో పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ అక్టోబరు 15వ తేదీ సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు.

నీట్ పీజీ–2026లో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌తో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.10,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.8,000 ఫీజుగా చెల్లించాలని అధికారులు తెలిపారు.