• వరంగల్‌ను అన్ని రంగాల్లో హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
  • వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, టెంపుల్, ఫారెస్ట్ టూరిజం, వరంగల్ ఎయిర్‌పోర్ట్ రోడ్ కనెక్టివిటీ, బస్ టెర్మినల్, ఔటర్ రింగ్ రోడ్డు తదితర కీలక అభివృద్ధి పనులపై సోమవారం రాత్రి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
  • వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనుల పురోగతిని అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
  • ఆస్పత్రి నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు సీఎం వెల్లడించారు. ఆస్పత్రిని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana