తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నిర్మాణంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులం పనులను సీఎం పరిశీలించారు.

అనంతరం దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులం పనులను పరిశీలించారు. దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను కూడా సీఎం పరిశీలించనున్నారు. భవన నిర్మాణాల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు.

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రోడ్డు మార్గంలో కొడంగల్ చేరుకుని అక్కడే బస చేయనున్నారు. శనివారం కొడంగల్‌లో చేపట్టాల్సిన, కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

By Rajini