D Spiritual: Dec 4: సాధారణంగా చాలామంది ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని ఇష్టపడతారు. మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచితే సమస్యలు దూరమవుతాయని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఉంచి పూజిస్తే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. తులసితో పాటు మరికొన్ని మొక్కలు కూడా ఇంట్లో పెంచితే శుభఫలితాలు లభిస్తాయి. అలాంటి మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. కానీ మనీ ప్లాంట్ పెంచేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తారు.

ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకునేవారు వాస్తు నియమాలకు విరుద్ధంగా నాటితే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఈశాన్య దిశలో నాటకూడదు. ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ పెంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడి, ఎంత ధనవంతుడైనా క్రమంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని నమ్మకం.

ఇంట్లో ఆగ్నేయ దిశను వినాయకుడి దిశగా భావిస్తారు. అందువల్ల మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిక్కులో నాటడం శ్రేయస్కరం. ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న కలహాలు తగ్గి, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని విశ్వాసం. అదేవిధంగా ఆర్థిక ప్రగతి కూడా లభిస్తుందని చెబుతారు.

మనీ ప్లాంట్ తీగ నేలను తాకకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తీగ నేలకు తగిలితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ ఎండిపోకూడదు. కుటుంబ సభ్యుల అప్రమత్తతలోపం వల్ల మొక్క ఎండిపోతే ఆ ఇంట్లో దరిద్రం పెరుగుతుందని చెబుతారు. ఇలాంటి ఎండిపోయిన మనీ ప్లాంట్‌ను వెంటనే ఇంటి నుండి తొలగించడం మంచిది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana