
D Spiritual: Mar 6: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన 29వ పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 6న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన పిన్ని మహేశ్వరితో కలిసి మెట్ల మార్గంలో నడుచుకుంటూ కొండపైకి చేరుకున్న ఆమె, తెల్లవారుజామున జరిగిన వి.ఐ.పి బ్రేక్ దర్శనంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను సమర్పించారు.
ప్రస్తుతం జాన్వీ కపూర్ సౌత్ సినిమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
