
DET:MAR 06:
స్క్రిప్ట్ లాక్.. ఏప్రిల్‌లో యాక్షన్!
డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయిందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఏప్రిల్ 2026 మధ్యలో ప్రారంభం కానుంది.థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రతి అభిమాని కచ్చితంగా పూర్తి సంతృప్తితో వస్తారని నేను ప్రామిస్ చేస్తున్నాను అని దర్శకుడు సిబి రీసెంట్ ఈవెంట్లో భరోసా ఇచ్చారు.
కమల్ హాసన్ నిర్మాణంలో.. అనిరుధ్ మ్యూజిక్:
ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తున్నారు.రజనీకాంత్, కమల్ హాసన్ దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇలా కలిసి పని చేయడం నిర్మాతగా కమల్,నటుడిగా రజనీ కోలీవుడ్‌లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.దీనికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పొంగల్ 2027 టార్గెట్:
ఈ సినిమా విడుదలకు సంబంధించి మేకర్స్ #SuperStarPongal2027 అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.అంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 2027 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని స్వయంగా రజనీకాంత్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కాస్ట్ అండ్ క్రూ విశేషాలు:
ప్రస్తుతానికి మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ ఇందులో రజనీకాంత్ కొడుకు పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది.అలాగే కథానాయికగా ప్రియా అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది.అయితే వీరి ఎంపికపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రజనీకాంత్ తన తదుపరి చిత్రం జైలర్ 2 పనుల్లో కూడా బిజీగా ఉన్నారు.
