
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భాగంగా తూర్పు హైదరాబాద్‌లో కీలకమైన మరో ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. అదే సాగర్ రింగ్ రోడ్ నుంచి బీఎన్ రెడ్డి నగర్ వరకు నిర్మించనున్న ఫ్లైఓవర్.
దాదాపు 3.2 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లుగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. సాగర్ రింగ్ రోడ్ నుంచి ప్రారంభమై హస్తినాపురం మీదుగా బీఎన్ రెడ్డి నగర్ వరకు ఈ కారిడార్ కొనసాగనుంది. ప్రస్తుతం ఎల్బీనగర్–బీఎన్ రెడ్డి నగర్ మార్గంలో వాహనాల రద్దీ భారీగా ఉంది.
విజయవాడ నేషనల్ హైవే, ఇన్నర్ రింగ్ రోడ్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో ఈ మార్గం నిత్యం రద్దీగా మారుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. తక్కువ దూరానికే ఎక్కువ సమయం ప్రయాణించాల్సిన పరిస్థితి వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది.
ఈ నేపథ్యంలో ప్రతిపాదించిన కొత్త ఫ్లైఓవర్ పూర్తయితే సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద వాహనాల వెయిటింగ్ టైమ్ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎల్బీనగర్–బీఎన్ రెడ్డి నగర్ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గడంతో పాటు మీర్‌పేట్, బడంగ్‌పేట్ వైపు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది.
