
భారతీయ రైల్వేకు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF), కపుర్తలాలో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కపుర్తలాలోని టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 734 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది.
ఈ పోస్టుల్లో ఫిట్టర్ మెషినిస్ట్ పెయింటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ తదితర ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండటంతో పాటు, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి
2026 సెప్టెంబరు 5 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులు (PwBD) 10 ఏళ్ల వరకు వయోసడలింపు పొందవచ్చు.
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD), మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఈ అప్రెంటిస్ నియామకంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండవు పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ
అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబరు 5వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు వయోపరిమితి, ట్రేడ్ల వారీగా ఖాళీలు ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించడం మంచిది.
