
DET:MAR 17:
ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదు:
జన నాయగన్ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో జరుగుతున్న ఆలస్యానికి NDA ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.సెన్సార్ బోర్డు స్వతంత్రంగా పనిచేస్తుందని అందులో రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
సొంత సినిమా OG ఉదాహరణతో క్లారిటీ:
ఈ సందర్భంగా పవన్ తన రాబోయే సినిమా OG గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.A సర్టిఫికేట్ OG సినిమాలో హింస ఎక్కువగా ఉన్నందున సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చిందని తాను దానిని గౌరవించానని చెప్పారు.నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాబట్టి మనకు అనుకూలంగా U/A సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు కదా అని నా టీమ్ అడిగింది.కానీ నేను దానికి ఒప్పుకోలేదు.సినిమాలో అంత వయలెన్స్ ఉంటే U/A ఎలా వస్తుంది? రూల్ ఈజ్ రూల్ అది అధికారంలో ఉన్నవారి కోసం మారదు అని పవన్ వివరించారు.
కోర్టుకు వెళ్లడంపై విమర్శలు:
జన నాయగన్ మేకర్స్ ఈ సమస్యపై కోర్టుకు వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.కోర్టుకు వెళ్లడం వల్ల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని బోర్డుతోనే సమస్యను పరిష్కరించుకోవాల్సిందని సూచించారు.ప్రతిదానికీ ప్రభుత్వాన్ని నిందించడం మానుకోవాలి అని ఆయన ఘాటుగా స్పందించారు.
