
DET:MAR 18:
అసలేం జరిగింది?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రవేశపెట్టిన మీ కల ఏంటో చెప్పండి అనే పథకాన్ని విమర్శించే క్రమంలో సీవీ షణ్ముగం నోరు జారారు.విళుప్పురం జిల్లాలో జరిగిన ఒక నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. నాకు నయనతార కావాలని చెబితే స్టాలిన్ నా కల నెరవేరుస్తారా? ఎవరైనా నయనతారను పెళ్లి చేసుకోవాలని అడిగితే ఆ కల నెరవేరుస్తారా? అంటూ వెటకారంగా మాట్లాడారు.
ఖుష్బూ సుందర్ ఘాటు స్పందన:
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా ఖుష్బూ సుందర్ సుదీర్ఘమైన నోట్ రాశారు.మహిళలు – ముఖ్యంగా మహిళా నటీమణులు – మీ ఆస్తి కాదు మీ చర్చా అంశం కాదు లేదా మీకు నచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి వాడే వస్తువు అసలే కాదు అని ఆమె మండిపడ్డారు.
ఒక మహిళా నటి పేరును మీ నీచమైన జోకులకు లేదా రాజకీయ విమర్శలకు ఒక సాధనంలా వాడుకోకండి అని హెచ్చరించారు.ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ మహిళా గౌరవానికి వచ్చే నష్టం ఏమీ లేదు.కానీ మీ పెంపకం మరియు మీ మనస్తత్వం ఎంత నీచంగా ఉందో బయటపడుతుంది అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.
బహుమానం ఒక వైపు ట్రాఫిక్ కాదు:
ప్రతి పురుషుడు ఒక స్త్రీకి జన్మించిన వాడేనని ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని ఆమె సూచించారు.కేవలం ఖుష్బూ మాత్రమే కాకుండా దక్షిణ భారత సినీ కళాకారుల సంఘం నడిగర్ సంఘం కూడా సీవీ షణ్ముగం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఎంపీ బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని పేర్కొంటూ ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
