D Spiritual: Jan 29: హిందూ ధర్మశాస్త్రాలు మరియు స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శివుడు దర్శనమివ్వడం అత్యంత శుభసూచకంగా భావిస్తారు. శివుడు మంగళకర స్వరూపుడు కావడంతో ఆయన కలలో కనిపిస్తే శుభ ఫలితాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే కలలో శివుడు ఏ రూపంలో దర్శనమిచ్చాడన్న దానిపై ఆధారపడి అర్థాలు మారుతాయి.

కలలో శివలింగం దర్శనమిస్తే మీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని అర్థం. ఇది విజయానికి సంకేతంగా భావిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయని, మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.

పార్వతీ పరమేశ్వరులు కలిసి కలలో కనిపిస్తే అది దాంపత్య సౌఖ్యానికి సూచనగా చెబుతారు. పెళ్లి కానివారికి త్వరలో వివాహ యోగం కలుగుతుందని, పెళ్లైనవారికి భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని అర్థం. అలాగే కొత్త అవకాశాలు జీవితంలో ప్రవేశించబోతున్నాయన్న సంకేతంగా కూడా భావిస్తారు.

కలలో శివుడు తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే, మీలో ఉన్న కోపాన్ని లేదా ఉద్వేగాన్ని నియంత్రించుకోవాలన్న సూచనగా తీసుకోవాలి. అదే సమయంలో పాత సమస్యలు ముగిసి, కొత్త జీవితం ప్రారంభమవుతుందన్న సంకేతంగా కూడా కొందరు పండితులు పేర్కొంటారు.

కలలో శివాలయం లేదా దేవాలయం దర్శనమిస్తే మీరు మానసిక శాంతిని కోరుకుంటున్నారని, లేదా మీకు ఉన్న అనారోగ్య సమస్యలు త్వరలో తగ్గబోతున్నాయని అర్థం చేసుకుంటారు.

అలాగే శివుని ఆభరణాలు కలలో కనిపించినా ప్రత్యేక అర్థాలుంటాయి. పాము కనిపిస్తే జ్ఞానప్రాప్తి మరియు ఆర్థిక లాభాలకు సూచనగా భావిస్తారు. త్రిశూలం దర్శనమిస్తే మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారం కాబోతున్నాయని అర్థం. డమరుకం కనిపిస్తే శుభవార్తలు వినబోతున్నారని సంకేతంగా చెబుతారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana