
DSports:Sep19:జమ్మూలో జరిగిన జాతీయ గ్రాప్లింగ్ (రెజ్లింగ్) ఛాంపియన్‌షిప్‌లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో నారాయణకు చెందిన విద్యార్థులు మూడు బంగారు పతకాలను సాధించి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ గ్రాప్లింగ్ ఛాంపియన్‌షిప్ – 2025లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆయుష్ ఠాకూర్, వైష్ణవి ఠాకూర్ పసిడి పతకాలను గెలుచుకుని తమ పాఠశాలకు, రాష్ట్రానికి కీర్తిని తెచ్చారు.
ఆయుష్ ఠాకూర్ అండర్-11 విభాగంలో పోటీపడి రెండు బంగారు పతకాలను సాధించాడు. వైష్ణవి ఠాకూర్ అండర్-15 విభాగంలో తన సత్తా చాటుకొని బంగారు పతకాన్ని సాధించింది.
ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి. సింధూర నారాయణ, డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ, ఆయుష్ మరియు వైష్ణవి సాధించిన విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా విద్యారంగంలో తమ విద్యాసంస్థలు పాటిస్తున్న విలువలకు ఈ విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులకు భవిష్యత్తులో కూడా క్రీడలలో ప్రోత్సాహం అందిస్తామని, వారి కలలను సాకారం చేయడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.
