
DSports Dec18 2025: భాగల్‌పూర్ (బిహార్): జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణులు సత్తా చాటారు. మాజీ అంతర్జాతీయ ఆటగాడు, అర్జున అవార్డీ చేతన్ ఆనంద్ కుమార్తె దియా ఆనంద్, తన భాగస్వామి ఆభా జాదవ్‌తో కలిసి అండర్-13 బాలికల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.
బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో దియా ఆనంద్ – ఆభా జాదవ్ జోడీ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించింది. టాప్ సీడ్ జోడీ అయిన ఆన్య (తెలంగాణ) – కైరా రైనా (మహారాష్ట్ర) లతో జరిగిన తుది పోరులో దియా జోడీ 21-14, 16-21, 21-15 స్కోరుతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది
