
DNews:13 Dec: ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ చారిటీ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద భారీ రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులు కింది సూచనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు తెలిపారు.
మ్యాచ్ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.స్టేడియం చుట్టుపక్కల పలు రహదారుల్లో దారి మళ్లింపులు ఉంటాయి. వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో, ఆర్టీసీ బస్సులు వినియోగించాలని సూచన.టికెట్ లేదా అధికారిక పాస్ ఉన్నవారికే స్టేడియంలోకి అనుమతి ఉంటుంది. టికెట్లు లేకుండా వచ్చే వారు స్టేడియం వైపు రావొద్దని స్పష్టం చేశారు.
మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందే గేట్లు తెరవనున్నారు. భద్రతా తనిఖీల దృష్ట్యా ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.నిషేధిత వస్తువులు, బ్యాగులు, ఫైర్వర్క్స్, వాటర్ బాటిల్స్ తీసుకురావద్దని పోలీసులు హెచ్చరించారు.ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని, అపోహలు నమ్మవద్దని కోరారు.మెస్సీ మ్యాచ్ను ప్రశాంతంగా, సురక్షితంగా వీక్షించేందుకు అభిమానులు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
