
DNews:13 Dec:సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.సికింద్రాబాద్–అనకాపల్లి, హైదరాబాద్–గోరఖ్పూర్, మచిలీపట్నం–అజ్మీర్ రూట్లలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు జనవరి నెలలో వివిధ తేదీల్లో అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణాలకూ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నాందేడ్, భోపాల్, ఉజ్జయిని, రత్లాం, భిల్వారా వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.పండగ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగపడతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుని రద్దీని నివారించాలని సూచించారు.
