
DNews:09 Dec: పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మంగళవారం మునుగోడు మండలం నాంపల్లి, నేరళ్లపల్లి, నర్సింహులగూడెం, రాందాస్తోండా, పెద్దాపురం, కేతేపల్లి, తిరుమలగిరి, మల్లపురాజుపల్లి, తుంగపహాడ్, టీపీ గౌరారం, వడ్డెపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవులు కంటే గ్రామాల అభివృద్ధి ముఖ్యమన్నారు. కాబట్టి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. మండలంలో రోడ్ల అభివృద్ధి, బస్టాండ్ నిర్మాణం వంటి పనులకు గట్టి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.మండలంలోని అన్ని పంచాయతీల్లో సర్పంచులు మరియు వార్డు సభ్యులను గెలిపించాలని ప్రజలను కోరుతూ ఆయన ప్రజలకు అభివాదాలు తెలిపారు.
