
DSports 9 Dec:న్యూ ఢిల్లీ: భారత జట్టు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన తొలినాళ్లలో, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనకు అందించిన మద్దతును గుర్తు చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలో జట్టులో స్థానం పదిలం చేసుకోవడానికి తాను పోరాడుతున్నప్పుడు రోహిత్ శర్మ నిరంతరం ప్రోత్సహించడం తనకెంతో ఉపయోగపడిందని శార్దూల్ వెల్లడించారు.
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ముందు ఒక క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన శార్దూల్, తనను నిలబెట్టిన కీలక వ్యక్తి రోహిత్ శర్మనే అని స్పష్టం చేశారు.
రోహిత్ శర్మ వంటి నాయకుడు మద్దతు ఉండటం యువ ఆటగాళ్లకు చాలా అవసరమని శార్దూల్ అభిప్రాయపడ్డారు
