
DSports 9 Dec:హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో సోమవారం (డిసెంబర్ 9, 2025) నిర్వహించిన అండర్-14 క్రికెట్ జట్టు ఎంపికలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తమ పిల్లలకు ఎంపికల్లో అవకాశం ఇవ్వడం లేదంటూ తల్లిదండ్రులు, క్రికెట్ అకాడమీ కోచ్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో మైదానం వద్ద హై టెన్షన్ నెలకొంది.
ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని అధికారులు స్పష్టం చేయడంతో, కొద్దిసేపటి తర్వాత మైదానం వద్ద పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.
