
D Spiritual: Nov 28: టాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ సందేశ్ ఇటీవల అయ్యప్ప మాల వేసుకున్నారు. తాజాగా ఆయన భార్య వితికా షేరుతో కలిసి అయ్యప్ప స్వామి పడి పూజను నిర్వహించారు.
సాధారణ భక్తులతో పాటు సినీ ప్రముఖులు కూడా అయ్యప్ప మాలను ధరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది పలువురు హీరోలు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరిస్తున్నారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నితిన్, రామ్ పొతినేని, వరుణ్ తేజ్, శర్వానంద్, ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని వంటి పలువురు స్టార్ హీరోలు అయ్యప్ప మాల ధరించిన విషయాన్ని తెలిసిందే.
ఇటీవల వరుణ్ సందేశ్ కూడా అయ్యప్ప మాల వేసుకుని తన దీక్షకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిరంతరం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈసారి ఆయన ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజను నిర్వహించారు. ఈ పూజలో ఆయన భార్య వితికా షేరు పాల్గొనడం విశేషం.
అయ్యప్ప పడి పూజకు సంబంధించిన ఫోటోలను వరుణ్ సందేశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్వాములందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం వరుణ్ సందేశ్–వితికా షేరు చేసిన ఈ పూజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా వరుణ్ సందేశ్ అనేకసార్లు అయ్యప్ప మాలను ధరించినట్లు సమాచారం.
