
D Spiritual: Oct 30: ప్రతి రోజు వారి కార్యక్రమాలలో భాగంగా మనం ఎన్నో పనులను చేస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే కొన్నిసార్లు తెలిసి తెలియక మనం చేసే పనులలో పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. ఈ విధంగా జరిగే పొరపాట్ల వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తాయని చెబుతారు. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం, ప్రతి రోజు కొన్ని పనులను సరైన సమయానికి నిర్వహించడం ఎంతో మంచిదని పండితులు చెబుతుంటారు. అయితే ఈ విషయాలను పాటించాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం.
రోజువారీ జీవితంలో జాగ్రత్తలు
పెద్దలు ప్రతిరోజూ కొన్ని పనులను చేయకూడదని చెబుతుంటారు. చాలామంది పొద్దు పొడిచిన తర్వాత నిద్ర లేచి, ఇంటి ముందు పాచి శుభ్రం చేసి నీళ్లు చల్లుతారు. ఇలా చేయడం మంచిది కాదు. సూర్యుడు ఉదయించక ముందే ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి, నీళ్లు చల్లడం శుభప్రదమని చెబుతారు.
నిద్రలేచిన తర్వాత చేయకూడని పని
చాలామందికి నిద్ర లేవగానే దుప్పటి అలాగే వదిలి వెళ్లడం అలవాటుగా ఉంటుంది. ఇలా చేయకూడదు. దుప్పటిని సరిచేసి, మంచం శుభ్రం చేయడం గృహశుభ్రతకు సంకేతం. అలాగే భోజనం చేసిన చోట ఎంగిలి కంచం ముందు అలాగే కూర్చోవడం పరమ దరిద్రం అని శాస్త్రాలు పేర్కొంటాయి.
పూజా గదిలో జాగ్రత్తలు
పూజ చేసే సమయంలో దేవుడి గదిలో ఒకే దేవుడికి సంబంధించి రెండు ఫోటోలు పెట్టకూడదని చెబుతారు. ఒకే దేవుడి రెండు చిత్రాలు ఉంటే ఆధ్యాత్మిక సమతౌల్యం దెబ్బతింటుందని నమ్మకం ఉంది.
సాయంత్రం తర్వాత కొనరాని వస్తువులు
సాయంత్రం ఆరు గంటల తర్వాత సూది, నూనె, ఉప్పు, కోడిగుడ్లు వంటి వస్తువులను కొనుగోలు చేయరాదు. ఈ వస్తువులను సాయంత్రం తర్వాత కొనుగోలు చేస్తే వాటితో పాటు శని దోషం మన వెంటే వస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ వస్తువులను సాయంత్రం 6 గంటల తర్వాత కొనరాదు అని సూచిస్తున్నారు.
ఇలా ప్రతిరోజు చిన్న చిన్న ఆచారాలను జాగ్రత్తగా పాటించడం ద్వారా గృహంలో శుభం, శాంతి, సమృద్ధి నిలుస్తాయని పెద్దలు చెబుతుంటారు.
