
DNews:11 Dec: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పెద్ద గందరగోళం చోటుచేసుకుంది. కుప్పగండ్ల గ్రామ పంచాయతీ పదో వార్డులో వార్డు సభ్యుడు ఎన్నికకు ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం పంపిన బ్యాలెట్ పత్రాల్లో యాదయ్య అనే అభ్యర్థికి కేటాయించిన గుర్తు లేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.
బ్యాలెట్ పేపర్ పరిశీలించిన ఓటర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక అభ్యర్థికి గుర్తు లేకపోవడం ఎన్నికల నిర్వహణలో పెద్ద లోపం కావడంతో, యాదయ్య ఎన్నికల అధికారులకు వెంటనే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు పోలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసారు.
ఈ ఘటనతో సంబంధిత వార్డులో పోలింగ్ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందనే విషయంపై స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి తదుపరి చర్యలు, సరిదిద్దే ప్రక్రియపై స్పష్టత రావాల్సి ఉంది.
