
DSports:17Sep: టోక్యో: భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా టోక్యోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రపంచ రికార్డు హోల్డర్ అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) వంటి బలమైన ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
గత పారిస్ ఒలింపిక్స్ లో ఓటమి అనంతరం ఈసారి పతకం గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సీజన్ లో 90.23 మీటర్ల అత్యుత్తమ త్రో సాధించిన నీరజ్, ఈ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టైటిల్ ను నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు.
క్వాలిఫికేషన్ రౌండ్ లో 84.50 మీటర్ల మార్క్ ను చేరితే ఫైనల్ కు నేరుగా అర్హత సాధిస్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 3:53 గంటలకు ఫైనల్ జరగనుంది. నీరజ తో పాటు భారత్ నుంచి సచిన్ యాదవ్, రోహిత్ యాదవ్, యష్వీర్ సింగ్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత అథ్లెట్ల నుంచి మరోసారి అద్భుత ప్రదర్శనను ఆశిస్తున్నారు.
