
DSports:17Sep:ఖమ్మం: తొమ్మిదేళ్ల క్రితం కాళ్లు కోల్పోయి వీల్ చైర్ కు పరిమితమైన ఖమ్మం యువకుడు షేక్ అబ్దుల్ నదీమ్, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో క్రీడల్లో రాణిస్తున్నాడు. బ్యాడ్మింటన్, త్రోబాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో అనేక పతకాలు సాధించాడు.
ఇటీవల జాతీయ త్రోబాల్ పోటీల్లో ప్రతిభ చూపినందుకు శ్రీలంకలో జరగనున్న సౌత్ ఆసియన్ పారా త్రోబాల్ ఛాంపియన్ షిప్ లో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. అయితే, ఈ టోర్నీలో పాల్గొనడానికి రూ. 59,000 ముందస్తు చెల్లింపు చేయాల్సి ఉంది.
వీల్ చైర్ లోనే ఫుడ్ డెలివరీ బాయ్ గా జీవనం సాగిస్తున్న నదీమ్ కు ఈ మొత్తం చెల్లించడం సాధ్యం కావడం లేదు. తన కలను సాకారం చేసుకోవడానికి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. నదీమ్ యొక్క అచంచలమైన స్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు
