మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే అభిమానులకు గుర్తొచ్చేది ఆయన అద్భుతమైన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్, డ్యాన్స్. అయితే ఒక నటుడిగా మాత్రమే కాకుండా, తన మాటలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రత్యేకత చిరంజీవికి ఉంది. ఇప్పుడు ఆ మాటల మాయను డిజిటల్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ‘చిరంజీవి’స్ మెగావర్స్’ కార్యక్రమంతో మెగాస్టార్ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
