DNews:05 Dec:దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) విమానాల రద్దు సమస్య కొనసాగుతోంది. సిబ్బంది కొరత, సాంకేతిక లోపాల వల్ల వరుసగా మూడో రోజుకూడా పెద్ద సంఖ్యలో సర్వీసులు నిలిచిపోయాయి. శుక్రవారం ఒక్కరోజే 500కుపైగా విమానాలను రద్దు చేసింది.ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొందరు బోర్డింగ్‌ పూర్తి చేసుకుని 12 గంటలపాటు ఎదురు చూడాల్సి వస్తోంది.విమానాల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం పెరుగుతోంది.

హైదరాబాద్‌ → కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానం గురువారం సాయంత్రం బయలుదేరాల్సి ఉండగా,
శుక్రవారం ఉదయం వరకు కూడా బయలుదేరలేదు.అయ్యప్ప మాల ధరించిన భక్తులు 12 గంటలపాటు ఎదురు చూసి చివరకు నిరసనకు దిగారు.బోర్డింగ్‌ గేటు వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని వారు మండిపడ్డారు.గత 2–3 రోజులుగా ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలు కొనసాగుతున్నాయి.దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో వేలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.అందుబాటు సిబ్బంది, విమానాల నిర్వహణలో సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana