DNews:03 Dec:హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో బుధవారం ఉదయం సంచలనం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నిలిపి ఉన్న ఆటోరిక్షాలో రెండు మృతదేహాలు కనిపించడం స్థానికుల్లో భయాందోళనలకు కారణమైంది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను అదే ప్రాంతానికి చెందిన జహంగీర్, ఇర్ఫాన్‌గా గుర్తించారు. మృతదేహాలపై ఎలాంటి బాహ్య గాయాలు కనిపించకపోవడంతో మరణానికి గల కారణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాథమిక దర్యాప్తులో, ఇద్దరూ ఇటీవల బాడీబిల్డింగ్ స్టెరాయిడ్లు, ఇతర పౌష్టిక పదార్థాలు వాడుతున్నారని తెలిసింది. అధిక మోతాదు కారణంగానే మరణించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.మృతదేహాలను శవపరీక్ష కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana