
DNews:13 NOV:సుబేదారి ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల నాయకుల దాడులను తీవ్రంగా ఖండిస్తూ గురువారం వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలు బంద్ నిర్వహించాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా నిరసన తెలిపారు.
సుబేదారి ఆర్ట్స్ కళాశాల నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాజీపేట, హనుమకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. దాడులకు పాల్పడిన విద్యార్థి సంఘాల నాయకులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తరువాత కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనలో పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
