
DNews:15 NOV:నల్లగొండ జిల్లా రూరల్ మండలం, నర్సింగ్ భట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని తిరుమల అంకిత ఖో-ఖో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.
నవంబర్ 14న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్-14 విభాగంలో ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) సెలక్షన్స్ కం ఛాంపియన్‌షిప్ పోటీలలో అంకిత ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ ప్రతిభ ఆధారంగా ఆమె ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు.
అంకిత ఈ నెలలో వికారాబాద్ జిల్లా పరిగిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది. అద్భుతమైన ప్రతిభ కనబరచిన విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి. మారయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మల్లీశ్వరీ, ఉపాధ్యాయులు మరియు పలువురు గ్రామస్తులు అభినందించారు.
