
DNews:13 NOV:హైదరాబాద్, నగరంలోని దుండిగల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బౌరంపేటలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. మెదక్ జిల్లా కుకునూరు మండలం వెల్దుర్తికి చెందిన ఆకాశ్ అనే బాలుడు ఇటీవల అమ్మమ్మ, తాతల వద్దకు వచ్చాడు. వారు బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్మెన్గా పనిచేస్తున్నారు.
ఉదయం భవనం ముందు ఆడుకుంటున్న ఆకాశ్ ప్రమాదవశాత్తు గేటు మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
