DNews:10 Dec: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. జాగృతి ‘జనం బాట’లో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన కవిత, మాధవరం కృష్ణారావు వ్యాఖ్యల్లో ‘ఫ్రస్టేషన్’ కనిపిస్తోందని అన్నారు.మాధవరం కృష్ణారావు చేసిన అవినీతి అక్రమాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటితో సహా రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తానని కవిత ప్రకటించారు.తాను కూకట్‌పల్లి నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా ఉన్న సమస్యలనే ప్రస్తావించానని, ఆయన 15 ఏళ్లుగా చేసిందే చెప్పానని కవిత తెలిపారు.మాధవరం చేసిన వ్యక్తిగత ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.గతంలో టీఆర్‌ఎస్‌లో తనను నిజామాబాద్‌కే పరిమితం చేశారని, ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలుగా ‘జనం బాట’ ద్వారా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నానని వివరించారు.

మాధవరం కృష్ణారావు విమర్శలు: ‘విస్కీ’ పేరు, లిక్కర్ స్కామ్

డిసెంబర్ 8న కూకట్‌పల్లిలో కవిత, ఎమ్మెల్యే కృష్ణారావుపై కబ్జాదారుడు అంటూ తీవ్ర ఆరోపణలు చేయగా, మాధవరం కృష్ణారావు మంగళవారం (డిసెంబర్ 9) మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు.కవిత ఇంట్లో పెంచుకునే కుక్క పేరు కూడా ‘విస్కీ’ అని, లిక్కర్​ స్కామ్‌తో ఆమె రాష్ట్ర పరువు తీసి, చరిత్రహీనురాలిగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు.కనీసం అత్తగారి ఊరిలో కూడా గెలవలేకపోయిన కవితకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను విమర్శించే నైతికత లేదని అన్నారు.కవితపై గతంలో అనేక ‘కుక్కలు’ మొరిగి పోయాయని, కవిత ఏ బంగారం దుకాణాన్ని వదలలేదని, ఆమె భర్త అక్రమాల చిట్టా తన వద్ద ఉందని కూడా మాధవరం కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, కేటీఆర్‌, హరీశ్‌‌ను జైలుకు పంపాలని కవిత కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana