
DNews:15 NOV:కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండల పరిధిలో శనివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సదాశివపల్లి సమీపంలో ఆగి ఉన్న ఒక లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 60 మందిలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని తక్షణమే 108 అంబులెన్స్‌లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
