DNews:06 Dec: తెలంగాణ రాష్ట్రంలో ration కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కింద నల్గొండ జిల్లాలో దేవరకొండలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో కొత్తగా లక్ష ration కార్డులను జారీ చేసినట్టు, వీటిలో 14,000 ration కార్డులు మాత్రమే దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేవరకొండలో ration కార్డుల జారీ బాగా లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడినట్లు విమర్శించారు.

2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కార్యకర్తల కృషితోనే ప్రభుత్వం కొనసాగుతున్నట్లు, ప్రజలకు నిత్యావసరాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana