DNews:12 Mar: సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి (Yashoda Hospital) లో గురువారం ఒక నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. తెల్లటి కోటు ధరించి డాక్టర్‌లా నటించిన ఒక గుర్తుతెలియని మహిళ, రోగికి చికిత్స చేస్తున్నట్లు నమ్మించి భారీ చోరీకి పాల్పడింది.ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యం కారణంగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆమె గురువారం డిశ్చార్జి కావాల్సి ఉంది. ఈ క్రమంలో, ఉదయం సమయంలో ఒక మహిళ డాక్టర్ వేషధారణలో (యాప్రాన్ ధరించి) సుధారాణి ఉన్న గదిలోకి ప్రవేశించింది. తాను ట్రీట్‌మెంట్ ఇవ్వాలని నమ్మించి, గదిలో ఉన్న రోగి బంధువులను బయటకు పంపించివేసింది.

అనంతరం, ఆ నకిలీ డాక్టర్ సుధారాణికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. రోగి స్పృహ కోల్పోయిన తర్వాత, ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను అపహరించి అక్కడి నుంచి చాకచక్యంగా పరారైంది. కాసేపటి తర్వాత గదిలోకి వెళ్లిన బంధువులు, సుధారాణి స్పృహ లేకుండా ఉండటం మరియు ఆమె ఒంటిపై బంగారం మాయమవ్వడం గమనించి షాక్‌కు గురయ్యారు.బాధితులు వెంటనే ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా, సదరు మహిళ తమ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కాదని వారు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రిలోని నర్సింగ్ స్టాఫ్ రూమ్ మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలను పరిశీలించగా, నకిలీ డాక్టర్ కదలికలు రికార్డయ్యాయి. ఈమె ఆసుపత్రి పరిసరాల గురించి అవగాహన ఉన్న వ్యక్తియా లేక పక్కా ప్లాన్‌తో వచ్చిన బయటి వ్యక్తియా అనే కోణంలో పోలీసులు గాలిస్తున్నారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana