
DNews:27 Nov:హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం రాచకొంద పోలీసులు భారీ స్థాయిలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో 15 రోజుల పాటు నడిచిన ఈ ఆపరేషన్‌లో 110 మంది పోకిరీలు పట్టుబడ్డారని రాచకొంద సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. పట్టుబడ్డ వారిలో 74 మంది మేజర్లు, 36 మంది మైనర్లు ఉన్నారని తెలిపారు.సీపీ వివరాల ప్రకారం నవంబర్ 1 నుంచి 15 వరకు మొత్తం 135 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వీటిలో ఫోన్ ద్వారా – 34, సోషల్ మీడియా ద్వారా – 48, నేరుగా – 53 అందాయని వెల్లడించారు.
ప్రయాణికురాలిపై దాడి చేసిన ఉబర్ ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టినట్లు చెప్పారు. అలాగే సోషల్ మీడియాలో వేధింపులు చేసిన మరో వ్యక్తిని, వేర్వేరు ఫోన్ నంబర్లతో యువతిని వేధించిన ఒకరిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా 49 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 7,481 మంది మహిళలకు భద్రత, హక్కులపై అవగాహన కల్పించినట్లు సీపీ వివరించారు.మెట్రో రైళ్లలో మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన 8 మందికి ఫైన్ విధించినట్లు తెలిపారు.సీపీ సుధీర్ బాబు మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ – 8712662111 కు మెసేజ్ లేదా ఫోన్ చేయవచ్చని సూచించారు.
