
DNews:18 NOV:హైదరాబాద్ బేగంపేటలో మంగళవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేగంపేట బస్ స్టాప్ వద్ద నిలిపి ఉంచిన థార్ జీప్‌ను వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేళ ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో థార్ వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ప్రమాద సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
