DNews: Nov 18: హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరచుగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం 10:05 గంటలకు విమానాశ్రయ సిబ్బందికి ఓ అనామక మెయిల్ వచ్చింది. అందులో శంషాబాద్ టెర్మినల్స్‌లో బాంబు పేలుడు జరిగిందని, వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరికలు ఉన్నాయి. మెయిల్‌లో “కసబ్‌ను మైనర్‌గా ట్రయల్ లేకుండా ఉరి తీశారు” అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఆపరేషన్కో సం మూడు నెలలుగా లాజిస్టిక్స్ సిద్ధం చేశామని పేర్కొన్నారు.

ఈ మెయిల్‌లో ముస్లింలు, మహిళలు, పిల్లలు వెంటనే విమానాశ్రయం విడిచిపెట్టాలని సూచించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో సహా విస్తృత తనిఖీలు చేపట్టారు. గతంలో వచ్చిన బెదిరింపుల్లా ఇవి కూడా తప్పుడు హెచ్చరికలుగా తేలినా, ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మెయిల్ ఎవరు పంపించారన్న దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు పంపారో తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana