అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. మంగళవారం భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం చేరాయి.

పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో తోమన్ కుమార్-శ్యామ్ సుందర్ స్వామి జోడీ 152-139తో ఇరాక్‌కు చెందిన అబ్బాస్-అన్వర్ జంటను ఓడించి స్వర్ణం సాధించింది.

మరోవైపు పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్లో హర్వీందర్ సింగ్-విజయ్తో కూడిన భారత జట్టు 6-2తో స్లోవేకియాను ఓడించి మరో పసిడి పతకాన్ని అందుకుంది.

మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లో భారత్‌కు రజతం దక్కింది. భావన-పూజ జోడీ 0-6తో చైనా చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. డబ్ల్యూ-1 మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో స్వాతి-అదిల్ మహ్మద్ జోడీ 1-5తో చెకియా చేతిలో ఓడి రజత పతకాన్ని సొంతం చేసుకుంది.

డబ్ల్యూ-1 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వాతి 6-2తో రష్యాకు చెందిన క్రటోవాపై విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకుంది.

మహిళల కాంపౌండ్ టీమ్ కాంస్య పతక పోరులో శీతల్ దేవి-పాయల్ నాగ్ జోడీ 140-149తో చైనా జంట చేతిలో ఓడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana