Dnews 10:చెన్నై మెట్రో రైళ్లలో ప్రదర్శించిన ఓ వాణిజ్య ప్రకటన తీవ్ర వివాదానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా, ఒక వస్తువుగా చూపేలా ఉందంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరువళ్లువార్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రచారం కోసం ఈ యాడ్‌ను రూపొందించింది. “గర్ల్‌ఫ్రెండ్ మీకు 0% వడ్డీ ఇవ్వొచ్చు. కానీ మా ఎఫ్‌డీ 14.40% వడ్డీ ఇస్తుంది” అనే అభ్యంతరకర వాక్యాలతో ఈ పోస్టర్‌ను మెట్రో కోచ్‌లలో ప్రదర్శించారు. మహిళల ప్రేమను, సంబంధాలను ఆర్థిక వడ్డీతో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. డిఎంకే ఎంపీ తమిళచ్చి తంగపాండియన్, అన్నాడీఎంకే ప్రతినిధి కోవై సత్యన్, సిపిఎం ఎంపీ వెంకటేశన్ తదితరులు ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న ఇలాంటి ప్రకటనలకు చెన్నై మెట్రో అడ్మినిస్ట్రేషన్ ఎలా అనుమతి ఇచ్చిందని వారు నిలదీశారు. ఈ పోస్టర్లను వెంటనే తొలగించాలని, బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. సృజనాత్మకత పేరుతో మహిళలను కించపరిచే ప్రకటనల పట్ల ప్రజా రవాణా వ్యవస్థలు మరింత కఠినమైన పర్యవేక్షణ ప్రమాణాలు పాటించాలనే డిమాండ్ ఇప్పుడు సర్వత్రా ఊపందుకుంది.

By CS.H

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana