D News: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించబోయే ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో, ‘సర్దార్’ ఫేమ్ పి.ఎస్. మిథ్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం.. దట్టమైన అడవి నేపథ్యంలో పౌరాణిక అంశాలతో కూడిన అడ్వెంచర్ కథగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించే ఆలోచనలో మిథ్రన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కథకు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది.

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘బజరంగీ భాయిజాన్’ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్నారనే వార్త నిజమైతే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

మరోవైపు ధనుష్ సరసన కరీనా కపూర్ నటించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై మిథ్రన్ గతంలో చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించినప్పటికీ.. కరీనా ఇంకా అధికారికంగా ఫైనల్ కాలేదని సమాచారం. కాంబినేషన్ ఖరారైతే ధనుష్, కరీనా తొలిసారి కలిసి నటించిన చిత్రంగా ఇది నిలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా డెవలప్‌మెంట్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు 2026 చివర్లో ప్రారంభించి, 2027లో షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ధనుష్, భన్సాలీ, మిథ్రన్ కాంబినేషన్‌కు విజయేంద్ర ప్రసాద్ కథ కూడా జతైతే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని చెప్పొచ్చు.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana