
D News: మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ బాక్సాఫీస్ వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆయన నటించిన ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ భారీ వసూళ్లతో రూ.250 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.
దీంతో మలయాళ చిత్ర పరిశ్రమలో సోలో హీరోగా నటించిన సినిమాతో రూ.250 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న రెండో హీరోగా నివిన్ పాలీ నిలిచినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకుముందు ఈ ఘనతను మోహన్‌లాల్ మాత్రమే సాధించినట్లు సమాచారం.మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చినా వసూళ్లపై పెద్దగా ప్రభావం పడలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా సినిమాకు వచ్చిన మౌత్ టాక్, ప్రేక్షకుల ఆదరణ కలెక్షన్లకు బలంగా మారినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా వసూళ్లు స్థిరంగా కొనసాగుతుండటంతో నివిన్ పాలీ మార్కెట్‌పై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తున్న నివిన్ పాలీకి ఈ విజయం కెరీర్‌లో కీలక మైలురాయిగా మారింది. అయితే రూ.250 కోట్ల వసూళ్లకు సంబంధించిన పూర్తి అధికారిక గణాంకాలను చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది.
