
D Spiritual: Nov 9: కలబంద మొక్క ప్రాముఖ్యత
కలబంద తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి! ప్రతి ఒక్కరికీ ఇది బాగా పరిచయమైన మొక్క. చాలా మంది తమ ఇళ్లలో కూడా దీనిని పెంచుకుంటారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మ రోగాలు, జీర్ణ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఇది సహజమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది ఇంటి పెరట్లో కలబంద మొక్కను ప్రేమగా పెంచుకుంటారు.
వాస్తు ప్రకారం కలబంద ప్రయోజనాలు
కానీ కలబంద మొక్క ఆరోగ్యానికే కాకుండా వాస్తు శాస్త్ర ప్రకారం కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందంటారు పండితులు. ఇంట్లో కలబంద మొక్క వికసిస్తే, ఆ ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయని చెబుతారు. కలబంద పువ్వును శుభ సంకేతంగా పరిగణిస్తారు. అందువల్ల ఎవరి ఇంట్లో ఈ మొక్క వికసిస్తుందో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్మకం ఉంది.
ప్రతికూల శక్తులను తొలగించే శక్తి
కలబంద మొక్క ఎవరి ఇంట్లోనైతే ఉంటుందో, ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు దూరమై, సానుకూల శక్తులు పెరుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఎవరి ఇంట్లో కలబంద పువ్వు వికసిస్తుందో, వారు ఆ పువ్వును ఎర్రటి వస్త్రంలో చుట్టి, డబ్బు నిలిచే చోట ఉంచితే ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అలా చేస్తే ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలువగా ఉంటుందట.
సంపద, అదృష్టానికి సంకేతం
వాస్తు నిపుణుల ప్రకారం కలబంద పువ్వును “సంపద ఆకర్షించే పువ్వు”గా పరిగణిస్తారు. ఎవరి ఇంట్లో ఇది వికసిస్తుందో, వారి ఇంటిలో ఆర్థిక స్థిరత్వం, సంపద వృద్ధి ఉండటమే కాకుండా అదృష్టం కూడా కలుగుతుందని చెబుతారు. ఇది మానసిక ప్రశాంతతను, శ్రేయస్సును అందించడమే కాకుండా, ప్రతికూల శక్తులను తొలగించే శక్తిని కలిగి ఉందని నమ్మకం ఉంది.
శుభ సూచనగా కలబంద వికాసం
ఇంటి లోపల కలబంద మొక్క వికసించడం అనేది ఆ ఇంటి వాతావరణం శుభప్రదంగా ఉందని, సానుకూల శక్తి పెరుగుతుందని సూచిస్తుంది. ఇది శ్రేయస్సు, అదృష్టం మీ ఇంటి తలుపు తట్టబోతున్న సంకేతమని పండితులు చెబుతున్నారు.
