
DSports 29 Nov:జమ్ము: భారత క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా పేరొందిన ఉమ్రాన్ మాలిక్ (Umran Malik), మళ్లీ టీమిండియా జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చే విషయంలో పూర్తి ఆశాభావం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టు నుంచి కొంతకాలంగా దూరంగా ఉన్న ఉమ్రాన్, తన బౌలింగ్‌లో వేగాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని, రాబోయే ఐపీఎల్ సీజన్ ద్వారా మళ్లీ జాతీయ జట్టు దృష్టిని ఆకర్షిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్ తన భవిష్యత్తు ప్రణాళికలు మరియు ప్రస్తుత ఫిట్‌నెస్ గురించి మాట్లాడాడు.
