
DSports 29 Nov:బెంగళూరు: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తరచుగా అంపైర్లతో, ప్రత్యర్థి ఆటగాళ్లతో సరదాగా మాట్లాడే పంత్, మైదానం వెలుపల కూడా తన హాస్య చతురతను ప్రదర్శిస్తాడు. తాజాగా, బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్‌లో పంత్‌ను చూసి ఒక ఫొటోగ్రాఫర్ బిగ్గరగా నవ్వుకోవడం, దానికి పంత్ ప్రతిస్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
