D Spiritual: Oct 28: కార్తీక మాసం వచ్చిందంటే ఇంట్లో పవిత్ర వాతావరణం ఏర్పడుతుంది. గుళ్లలో, ఇళ్లలో కార్తీక దీపాలు వెలుగుతాయి. ఈ మాసంలో చేసే పూజలు, పరిహారాలు ప్రత్యేక ఫలితాలు ఇస్తాయని నమ్మకం. విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి మొక్కకు సరళమైన పూజలు చేస్తే దేవతల ఆశీస్సులతో పాటు ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. 2025లో కార్తీక మాసం అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ నెలంతా శ్రీ మహా విష్ణువు, శ్రీ కృష్ణుడి ఆరాధనకు అంకితం చేయాలి. చెడును విడిచి భక్తి మార్గంలో నడవడానికి ఇది సరైన సమయం. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కార్తీకంలో మనస్ఫూర్తిగా పూజిస్తే ఇంట్లో సంతోషం, ఆర్థిక స్థిరత్వం ఉంటాయి. సంపద పెరగాలంటే పవిత్ర వస్తువులను తులసి దగ్గర ఉంచి చిన్న పూజలు చేయాలి.

గోమతి చక్రం: గోమతి నదిలో లభించే ఈ పవిత్ర వస్తువును విష్ణువు-లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కార్తీకంలో తులసి దగ్గర ఉంచితే ఆర్థిక భద్రత, స్థిరత్వం లభిస్తాయి. రోజూ సాయంత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. ఇది అజ్ఞానాన్ని పోగొడుతుంది, విష్ణు-లక్ష్మీని ప్రసన్నం చేసి ధనలోటు లేకుండా చేస్తుంది.

పసుపు కొమ్ము: శుభానికి, అదృష్టానికి చిహ్నం. విరగని పసుపు కొమ్మును తులసి మొదట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ, డబ్బు నిలుస్తాయి.

సాలగ్రామం: విష్ణువు గుర్తు. తులసి దగ్గర ఉంచితే విష్ణు-లక్ష్మీ బంధానికి ప్రతీకగా ఐశ్వర్యం నిండుతుంది.

ఈ వస్తువులతో పాటు మంచి అలవాట్లు పాటించాలి. రోజూ ఉదయం స్నానం తర్వాత తులసికి నీళ్లు సమర్పించాలి – ఇది సంతోషం, సంపద తెస్తుంది. అయితే ఆదివారం తులసికి నీరు పోయకూడదు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana