D Spiritual: Mar 17: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఆలయ శుద్ధి కార్యక్రమమైన ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎక్స్ అఫిషియో మెంబర్ మరియు తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. గోవిందుని కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఇలాంటి పరమ పవిత్రమైన శుద్ధి కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తి భావంతో ఈ సేవలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధ్యక్షుడు, బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు మరియు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana