
DSports 18Feb 2026:అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు విజయాలతో ఇప్పటికే సూపర్-8కు చేరిన టీమిండియా, నేడు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. గ్రూప్ దశను అజేయంగా ముగించాలని భారత్ పట్టుదలగా ఉండగా, సూపర్-8 కీలక మ్యాచుల దృష్ట్యా జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.
- ఈ మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ ప్రధానంగా వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించింది. అందిన సమాచారం ప్రకారం, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకుని ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని సూర్యకుమార్ యాదవ్ యోచిస్తున్నాడు.
- వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. సూపర్-8కు ముందు అతను ఫామ్‌లోకి రావడం జట్టుకు చాలా కీలకం. అందుకే ఈ మ్యాచ్‌లో కూడా అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు.
