DSports 18Feb 2026:చెన్నై: క్రికెట్ మైదానంలో బ్యాటర్లు రకరకాల షాట్లు ఆడటం మనం చూస్తుంటాం. కానీ, కొన్ని షాట్లు చూసినప్పుడు మాత్రం “అసలు ఇది ఎలా సాధ్యం?” అని నోరెళ్లబెట్టాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో న్యూజిలాండ్ విధ్వంసకర వీరుడు గ్లెన్ ఫిలిప్స్ సరిగ్గా ఇలాంటి షాట్ ఒకటి ఆడి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

  • కెనడాతో జరిగిన కీలక మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఆడిన ఈ ‘స్విచ్ హిట్ సిక్సర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ వేసిన మూడో బంతిని ఫిలిప్స్ టార్గెట్ చేశాడు.బంతిని వేయకముందే తన స్టాన్స్‌ను మార్చుకున్న ఫిలిప్స్, ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లాగా మారిపోయి, కళ్ళు చెదిరే రీతిలో బంతిని డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా గాల్లోకి లేపాడు.
    అది నేరుగా స్టేడియం బయట పడింది. బౌలర్ వేసిన వేగాన్ని వాడుకుంటూ, దిశను మార్చి అతను కొట్టిన వినూత్న షాట్‌కు కామెంటేటర్లు సైతం “వాటే షాట్!” అంటూ కేకలు వేశారు.
  • ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగానే నిమిషాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు:

“ఇది క్రికెట్ షాటా లేక మ్యాజిక్కా?” అని ఒకరు కామెంట్ చేయగా, “అసలు ఈ సిక్స్ ఎక్కడ చూడలేదు బాబోయ్!” అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana