DSports Jan12 2026: “ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పర్మనెంట్” అనే మాటను విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ, రికార్డుల వేటలో మాత్రం కోహ్లీ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోయాడు.

  • 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కోహ్లీ వెన్నెముకగా నిలిచాడు.కోహ్లీ 91 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 93 పరుగులు చేసి దుమ్మురేపాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56)తో కలిసి రెండో వికెట్‌కు 118 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఆఖర్లో కేఎల్ రాహుల్ (29 నాటౌట్) సిక్సర్‌తో మ్యాచ్ ముగించగా, కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
  • అత్యంత వేగంగా 28,000 పరుగులు అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను ఆయన కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించగా, గతంలో సచిన్ టెండూల్కర్ (644 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డు కనుమరుగైంది.సంగక్కరను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కర (28,016)ను వెనక్కి నెట్టి కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఆయన కంటే ముందు కేవలం సచిన్ (34,357) మాత్రమే ఉన్నాడు.కివీస్‌పై 3 వేలు న్యూజిలాండ్‌పై అన్ని ఫార్మాట్లు కలిపి 3000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana