D Spiritual: Dec 13: గోదావరి పుష్కరాలు – 2027

మన దేశంలో పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశంలోని పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల పుష్కరాలను ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలు మొత్తం 12 రోజుల పాటు కొనసాగనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు, ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఆ నివేదిక ఆధారంగా పుష్కర తేదీలను ఖరారు చేశారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించింది. గోదావరి పుష్కరాలు 2027 జులై 7వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana