D Educt: Aug 22: ఉన్నత విద్యలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరి

ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రిజర్వేషన్‌ను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు నిజంగా ప్రయోజనం కల్పించాలని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్‌ కౌర్‌ నందా సూచించారు.

అశోక యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మన్మీత్‌ కౌర్‌ నందా ఈ అంశంపై మాట్లాడారు. ఉన్నత విద్యలో దివ్యాంగ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించేలా కేంద్ర ప్రభుత్వం 2016లోనే చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే కొన్ని విద్యాసంస్థలు ఈ నిబంధనలను అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

రిజర్వేషన్‌ అమలుకు సంబంధించి ఇప్పటికే పలు కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థలు చట్టబద్ధమైన రిజర్వేషన్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana